A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z


విశ్వప్రకాశునకు వెలియేడ లోనేడ |

శాశ్వతునకూహింప జన్మమికనేడ ||


సర్వ పరి పూర్ణునకు సంచారమిక నేడ |

నిర్వాణమూర్తికిని నిలయమిక నేడ |

వుర్వీధరునకు కాలూదనొకచోటేడ |

పార్వతీస్తుత్యునకు భావమిక నేడ ||


నానా ప్రభావునకు నడుమేడ మొదలేడ |

ఆనన సహస్రునకు నవ్వలివ లేడ |

మౌని హృదయస్తునకు మాటేడ పలుకేడ |

జ్ఞానస్వరూపునకు కానవిన వేడ ||


పరమ యోగీంద్రునకు పరులేడ తానేడ |

దురిత దూరునకు సంస్తుతి నిందలేడ |

తిరువేంకటేశునకు దివ్య విగ్రహమేడ |

హరికి నారాయణున కవుగాములేడ ||